15, ఏప్రిల్ 2021, గురువారం

మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! -2

కందము.
ప్రక్కనె యుండగ తాళము/
లెక్కడ పోయినవని తెగ యెగిరెగిరి పడే/
తిక్కల పెనిమిటితో నెక/
సెక్కము లాడుట యదొక్క శ్రీమతికె తగున్! 😀

జగమంతయు వెదకితి మరి/ 
యగుపడ లేదంచు, నాలి నడుగుట పతిదే/
వుగ నా హక్కని తలచెడు/
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! 🤷🏻‍♀️

- రాధేశ్యామ్ రుద్రావఝల
15.04.2021

2 కామెంట్‌లు:

  1. నాకు పద్యం కుదింపు బాగుంది మా ఆవిడకు పద్యం ముగింపు బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. హహ్హా..! భలే..! నాకు మీ మదింపు ఇంకా బాగా నచ్చిందండీ..! ధన్యవాదాలు..!!

    రిప్లయితొలగించండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు