22, ఏప్రిల్ 2021, గురువారం

కవిత్వమెలా పుడుతుంది..!?


తే. గీ. (పంచపాది)
గుండెలోతులందున తడి యుండి నపుడు/
బీజమాత్రపు భావము వికసితమగు/
రాత్రి దాగుండి భూమిని చిత్రముగను/  
తెల్లవారగ కనబడు పల్లవముగ/
బయలు పడును చైతన్యమై భావకవిత..!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(29.05.2018)

కవితాభావన అనే బీజం చిగురించాలంటే, గుండె లోతులలో 'తడి' ఉండాలి.
అది తగలగానే, భావనా బీజం వెంటనే చైతన్యవంతమై, చిగిర్చి, పైకి వచ్చేస్తుంది - రాత్రి లేక, తెల్లవారగానే దర్శనమిచ్చే మొలకలా!


శ్రీ డా. రామ్ ప్రసాద్ గారు చెప్పిన పై భావాన్ని పద్యరూపమున నుంచుటకు ప్రయత్నించాను.

4 కామెంట్‌లు:

  1. గుండెలోతులలో చెమ్మ
    కవితా బీజానికి కమ్మ
    నీటితో చిగురించే రెమ్మ

    రిప్లయితొలగించండి
  2. ఆహా..! మూడు ముక్కల్లో ఎంతబాగా చెప్పారండీ..! ధన్యోస్మి..!

    రిప్లయితొలగించండి
  3. ఎంత చక్కటి భావన!మీ సృజనాత్మకతకూ,సాహితీప్రతిభకూ వందనం 🙏

    రిప్లయితొలగించండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు