సీతాకోకచిలుక
******
ముత్యాలసరము:
1. రంగుచీరలు కట్టికట్టీ
మొహం
మొత్తీ మార్పుకోరీ
నలుపు
తెలుపుల కోక నేడే
కట్టుకున్నావా!?
2. ఎన్ని రంగులు! యెన్ని హంగులు!
ఎంత
అందం? ఏమి చందం?
ఎక్కడిది
నీకా వయారం,
అంత
సుకుమారం!?
3. పురువుగా నువు పడిన కష్టం
ఒంటిగా
నుండేటి వైనం
సుందరిగ
ఈ నీ ప్రయాణం
మాటకందేనా?
4. ఓర్చినమ్మకి తేటనీరట
కష్టముల
కెదురీది నేడీ
అందమైనటు
వంటి రూపం
సంతరించావా!!??
5. నీకు నీ ఓపికకు జోహార్
అనుచు
దైవం పూలమధ్యన
తేనెనే
త్రాగుచును కడుపును
నింపుకొనమనెనా?
6. చీదరించిన వెగటు లోకం
నేటి
నీ ఈ రూపుజూసీ
అబ్బురం
పడిపోతు ఉంటే
నవ్వు
రాలేదా..??
7. ఈసడింపుల చీదరింపుల
మనసులోనవి
పెట్టుకొనకా
పువ్వు
రంగుల మాకు నవ్వుల
పంచుతున్నావా!