29, జనవరి 2020, బుధవారం

భుజంగ ప్రయాతం లో హెచ్చరిక..!😃

భుజంగ ప్రయాతంలో సరదాగా ప్రయత్నించాను:

ప్రమాదమ్ము రా, సోదరా! పెండ్లి తంటా/
ల మారాకురా! యింత లాభంబదే లే/
దు, మాయేను రా! దాని తో చెడ్డ చిక్కొ/
చ్చు, మానెయ్యరా! నన్ను చూశావు, చాల్దా?

- రాధేశ్యామ్ రుద్రావఝల 😁😁😁

12, జనవరి 2020, ఆదివారం

శూన్యం - అనంతం

ఆ.వె.
ఆర్యభట్టు, నాడు ఆలికి జడియని
భర్తలెందరనుచు ప్రశ్నవేసి,
పురుషుడొక్కడైన పుడమిలేక, జవాబు
శూన్యమని, కనుగొనె ’సున్న’ నట్లు!

(ఆర్యభట్టు ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త. సున్న ను కనుగొన్నది ఇతనే అని చెప్తారు. ఖగోళ శాస్త్రానికి, శూన్యానికి అవినాభావ సంబంధం, అందుకని శూన్యమనే పద ప్రయోగం చేసాను)

ఆ.వె.
వ్రాయగోరె శ్రీనివాసరామానుజం
నేటి భార్యలకు వణికెడు పతుల
లెక్క; నంతులేక లెక్కింపజాల '
నంతము
ను కనుగొనె నతడు వేత్త!

(Infinity (అనంతము)ను కనుగొన్న ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం ఆర్యభట్టు తో పోల్చితే నిన్న మొన్నటి వాడే. ఈ పద్యంలో లెక్కలు వ్రాయడం పద ప్రయోగం)
- రాధేశ్యామ్ రుద్రావఝల
12.01.2020

ఇది వాట్సాప్ లో పంపబడ్డ జోకుకు పద్యరూపం.
ఆ జోకు ఇది:

ఆ ఒరిజనల్ జోకుని కల్పించిన వారికి నా ధన్యవాదాలు.

5, జనవరి 2020, ఆదివారం

పుస్తకము


 
కం.
పుస్తకము గురువు జనులకు/
పుస్తక పఠనమ్ము పెంచు బుద్ధి కుశలతన్/
పుస్తకము మంచి మిత్రుడు/
పుస్తకమే తోడు మనకు ముదమున చదువన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల
06.01.2020

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు