శివుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2021, ఆదివారం

వ్యాజస్తుతి..!


శార్దూలము.

నీ సొమ్మేమది పోవునో, భవహరా! నీకెంత యాటాయెనో!
యే సార్థక్యము కల్గి గొప్పదగు పేరే దాల్చెదో! గొంకవో!
యీ సంసార పయోధి ముంచక ప్రభో! యెట్లైన దాటింపవో!
యో సామీ! తమ పాదముల్ గొలువ లేదో !?  తండ్రి! కాపాడుమా!

21, ఏప్రిల్ 2018, శనివారం

ఓమ్ నమః శివాయ

ఆ.వె.
అన్ని మంత్రములకు నాది మంత్ర మిదియ/
నాది పురుషుడాత డాది దేవు/
డతని స్మరణజేయు మందగ మోక్షము/
పలుకు మోం నమశ్శివాయ యనుచు..!

- రాధేశ్యామ్ రుద్రావఝల
20.04.2018

6, మార్చి 2018, మంగళవారం

శివుడు..!!

ఆ.వె.
గంగ యనిన నీకు జంగమ కడు ప్రీతి
సిద్ధమీవు మరొక యుద్ధరణికి
నీదు శిరము తనకు నెలవు జేసినగాని
తనివి తీరకున్నదా త్రినేత్ర ?


కందము:
కోరడు క్రతువుల తపముల
చారెడు భస్మమును పూయ సంతసమందున్!
మారేడుదళమ దొక్కటి
పారగ నభిషేక జలము పైనిడ చాలున్!

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు