30, డిసెంబర్ 2019, సోమవారం

మధ్యాక్కఱలో మొదటి ప్రయత్నము

ఇది 'మధ్యాక్కఱ' ఛందస్సులో నా మొదటి ప్రయత్నము:


మధ్యాక్కఱ:
నామనవి వినంగ నీకు నామోషి యాయెనా!? చెలియ,
ప్రేమ పొంగగ నీపయి, మది రేగె నేవో కోర్కె, లింక
కామితార్థము నీయగాను కనికరింపవుగదే సఖియ
నామనసును తెలిసికొని నాప్రాణము నిలుపు! సత్య
భామా! యలుకలు చాలు ననె వాసుదేవుడు కృష్ణు డపుడు!
- రాధేశ్యామ్ రుద్రావఝల
30.12.2019
ఫొటో కర్టెసీ: శ్రీకృష్ణపాండవీయం సినిమా





20, డిసెంబర్ 2019, శుక్రవారం

హరితకలితము..!

Photo Courtecy - Sandhya Rudravajhala
ఆటవెలది:
చిక్కిశల్యమైన స్నేహితుని కనగ/
మనసు వికల మాయె మగువ లతకు!
హరిత సంపదతని దావిరై పోవగా/
కౌగలించి తనదు కలిమి పంచె!! 

- రాధేశ్యామ్ రుద్రావఝల


28.05.2018 న వ్రాసిన పద్యం ఇది.


5, డిసెంబర్ 2019, గురువారం

వచన కవిత..!!

వచన కవిత:
--------------

వరదలా
జీవనదిలా
పెను గంగలా

రస ప్రవాహంలా
అలుపెరగని జలపాతంలా
ముసురు పట్టి ఆగని వర్షంలా
చిల్లుకుండలా
విరిగిన కొళాయిలా
ఊర్వశి శారద కన్నీటిలా
వడిగా
ఆగకుండగా
ధారాపాతంగా
......
...........
...............
నా 
ముక్కు 
కారిపోతోంది..!!

******

ముత్యాలసరము:
కనుల యెర్రని జీరలొచ్చెను/
బుగ్గలవియె గులాబులాయెను/
పెదవులన్ చిరు వణుకు బుట్టెను/
నాకు జ్వరమొచ్చెన్..!!
***********
కందము:
అయ్యెను ఫీవర్ వైరల్/
కుయ్యనగా ఇంటనున్న కుర్రల మొదలై/
అయ్యకు వచ్చెను మరియిక/
చయ్యన నికనైన మరలు సౌండిక లేకన్..!!
***********

సవరణలతో:
కందము:
అయ్యెను ఫీవర్ వైరల్/
కుయ్యనగా ఇంటనున్న కుర్రల మొదలై/
అయ్యకు వచ్చెను చివరకు/
చయ్యన నికనైన మరలు సౌండది లేకన్..!!
కందము:
అయ్యెను ఫీవర్ వైరల్/
కుయ్యనగా ఇంటనున్న కుర్రల మొదలై/
అయ్యకు వచ్చెను చివరకు/
చయ్యన నికనైన మరలు చప్పుడు లేకన్..!!

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు