తెలుగుబాల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగుబాల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, ఆగస్టు 2019, శుక్రవారం

దీనుడైనంత మాత్రాన హీనుడు కాదు!

ఆ.వె.
దీనుడైనవాని హీనుడనుచునెంచి
యపహసింపబోకు మహముతోడ
నేడు కలుగు సిరి యనిత్యమను నిజము
తెలిసి వ్యవహరించు తెలుగు బాల!

ఆదర్శములు - తెలుగుబాల!

ఆ.వె.
ఆచరింపనట్టి యాదర్శములు గల/
సూక్తులెన్ని తెలియ ముక్తి యేది?
తలచియూరుకొనక తత్పర బుద్ధివై/
దీక్షతోడ మెలగు తెలుగుబాల!

(11.05.2019)

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు