శుభోదయం.
శార్దూలము.
ఉర్వీపుత్రిక జాడ తానెఱిఁగి యయ్యుత్సాహ సంరంభమున్/
గర్వాంధుండగు రాక్షసాగ్రణికి చీకాకున్ ప్రకోపింపగా/
నార్వేరంబు తొలంగ దాశరథికిన్ హర్షంబు చేకూర్చు నా/
దుర్వారోద్యమ బాహు విక్రముని, నస్తోకప్రభారాశినిన్/
సర్వాభీష్ట ఫలప్రదాత హనుమన్ సద్భక్తి నే మ్రొక్కెదన్!
ఆర్వేరము = కలఁత
భూమిజ యైన సీత జాడ తెలిసికొని, ఆ ఉత్సాహముతో, గర్వాంధుడగు రాక్షసరాజైన రావణుని చీకాకు పరచి, రామునికి కలత పోగొట్టి ఆనందమును కలిగించిన ఎదురులేని బాహుబల సంపన్నుడూ, అనల్పమైన కాంతితో వెలుగొందేవాడు, అభీష్టములన్నీ నెరవేర్చేవాడూ అయిన హనుమకు సద్భక్తితో నేను నమస్కరిస్తున్నాను.
- రాధేశ్యామ్ రుద్రావఝల
12.01.2022
హనుమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హనుమ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, జనవరి 2022, బుధవారం
హనుమన్ సద్భక్తి నే మ్రొక్కెదన్!
7, మే 2018, సోమవారం
హనుమ
శార్దూలము:
రామస్వామికి సీతజాడ తెలుపన్ లంకాపురిం జేరినా/
వామెన్ దుఃఖవిముక్తగా నిలిపినా వారీతిగా మాకు శ్రీ/
రామున్ జేరెడు దారిజూపు మిక నారాధింపగా మారుతీ!
స్వామీ! నీకృపనే సదామదిని నే వాంఛింతు వేయేటికిన్!
- రాధేశ్యామ్ రుద్రావఝల
11.12.2017
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు : ********************* హేడ్లీ తో చెప్తున్నాను: కం. హేడ్లీ! వేడిగ సాంబా/ రిడ్లీ...
-
ఉత్పలమాల: శ్రీ వనితా కరాంబుజ సుసేవిత పాద యుగమ్ము దల్చెదన్/ పావని గంగ జన్మమయి పాఱెడు పాద యుగమ్ము నంటెదన్/ దేవమునీంద్ర సన్నుతుల తేలెడు పాద...
-
మరొక కథకు పద్యం. ----------------------------- పగటి కలల బాపఁడు ----------------------------- ఆ. వె. బ్రాహ్మడొకఁ డలసుఁడు వారణాశి నివాసి, వీథ...