రాముడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాముడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, డిసెంబర్ 2024, సోమవారం

అయోధ్యా రాముడు



చంపకమాల.

దినమణి వంశ దీపకుఁడు, తీరుగ ముద్దులు మూటగట్టుచున్/
కనకపు చేలఁ గట్టి, కరకంకణముల్, మణిహారపంక్తులన్/
తనరుచు, చాపబాణముల దాలిచి, స్వర్ణ కిరీట ధారియై/
ఘనమగు గద్దెపై నిలిచి కాంతుల చిందెను బాలరాముడై!
ప్రణతుల, మేన పుల్కల శుభమ్ముల కోరుచు నా
యయోధ్య రా/
ముని కనులార గాంచితిమి మోదము, భాగ్యము నంది ధన్యతన్!

-- రాధేశ్యామ్ రుద్రావఝల

20.12.2024

ఈ నెల 13వ తేదీన అయోధ్య రాముణ్ణి దర్శించుకున్నాం.

🙏🙏🙏

21, ఏప్రిల్ 2022, గురువారం

జగదీశుడు రాముడు



చంపకమాల:
తన మృదుభాషణంబు తన ధర్మపరాయణతల్ బలంబుగా/
వనచర సేన తోడ, పెను వారధిఁ గట్టి, పయోబ్ధి దాటి, భీ/
షణ రిపు దానవాగ్రణిని చంపెను తాను మహాద్భుతంబుగా/
నినకుల భూషణుండు జగదీశుడు రాముడు మార్గదర్శియై!

- రాధేశ్యామ్ రుద్రావఝల

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు