11, నవంబర్ 2019, సోమవారం

'గ' గుణింతపు పద్య ప్రహేళిక

ఇదివరకు వాట్సాప్ లోనే ’క’ గుణింతపు పద్య ప్రహేళిక చదివి ఉంటారు. కమ్మగా చెవిసోకి కంచికేగిన వేవి? అంటూ సాగుతుంది అది..!! అది ఎవరు వ్రాసారో తెలియదు. అది చదవని వారి కోసం ఈ లింకు:
’క’ గుణింతపు పద్య ప్రహేళిక

Mine coins - make money: http://bit.ly/money_crypto
’క’ గుణింతపు పద్య ప్రహేళిక

Mine coins - make money: http://bit.ly/money_crypto
’క’ గుణింతపు పద్య ప్రహేళిక

Mine coins - make money: http://bit.ly/money_crypto
’క’ గుణింతపు పద్య ప్రహేళిక

Mine coins - make money: http://bit.ly/money_crypto
’క’ గుణింతపు పద్య ప్రహేళిక


అదే ఆధారంగా ఇది నేను వ్రాసిన 'గ' గుణింతపు పద్య ప్రహేళిక:

సీస మాలిక.
విష్ణు వాహనమైన వినత కొడుకెవరు?
వేదమాతగ నౌచు వెలుగు నెవరు? 
పర్వత పుత్రిక పర్యాయ పదమేది?
పోరున కృష్ణుని బోధ యేది?
ఇంటికన్న పదిలమ్మేదని యందురు?
చెట్టుపై పిట్టలు కట్టు దేని?
నింటికి దీపమ యెవరని యందురు?
చెప్పరో జనులార శీఘ్రముగను!

ప్రత్యర్థి నోడింప వశమగునది యేది?
ఇంటికి యజమానికేమి పేరు?
పర్వత ధాతు సంబంధి నేమందురు?
యెండ వానలనుండి యేది గాచు?
దానాల నేది వైతరణి దాటించునో?
అలయహల్యను పెండ్లి యాడెనెవరు?
హరిపాదమునబుట్టి హరుని చేరినదేది?
చెప్పగా వికసించు చిన్ని నగవు!

తేటగీతి:
పైని ప్రశ్న లరసి సమాధానములను/
కాంచరో చదువరులార 'గా' గుణింత/
మును పదముల మొదటి వర్ణముగ నిలుపుచు/
కమ్మనౌ పద్య మందు నిండిమ్ముగాను!

- రాధేశ్యామ్ రుద్రావఝల
(10.11.2019)

నా ఈ ప్రయత్నంలో తమ అమూల్యమైన సూచనలిచ్చిన గురుదేవులు శ్రీ రామరాయ మహోదయులకు ధన్యవాదాలు, కృతజ్ఞతాంజలులు.
జవాబులు కనిపెట్టి వ్యాఖ్యలలో వ్రాయండి.

7 కామెంట్‌లు:

  1. విష్ణు వాహనమైన వినత కొడుకెవరు?
    1.గరుడుడు
    వేదమాతగ నౌచు వెలుగు నెవరు?
    2.గాయత్రి
    పర్వత పుత్రిక పర్యాయ పదమేది?
    3.గిరిజ
    పోరున కృష్ణుని బోధ యేది?
    4.గీత
    ఇంటికన్న పదిలమ్మేదని యందురు?
    5.గుడి
    చెట్టుపై పిట్టలు కట్టు దేని?
    6.గూడు
    నింటికి దీపమ యెవరని యందురు?
    7.గృహలక్ష్మి
    ప్రత్యర్థి నోడింప వశమగునది యేది?
    8.గెలుపు
    ఇంటికి యజమానికేమి పేరు?
    9.గే
    పర్వత ధాతు సంబంధి నేమందురు?
    10.గైరేయం
    యెండ వానలనుండి యేది గాచు?
    11.గొడుగు
    దానాల నేది వైతరణి దాటించునో?
    12.గోదానం
    అలయహల్యను పెండ్లి యాడెనెవరు?
    13.గౌతముడు
    హరిపాదమునబుట్టి హరుని చేరినదేది?
    14.గంగ

    రిప్లయితొలగించండి
  2. మీ స్పందనకు ధన్యవాదాలు హరిబాబు గారూ..! గే - గేస్తు అండీ..! గృహస్థు కు వికృతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును కదూ!అది రాసేటప్పుడు తోచలేదు - ఎంతసేపూ గృహస్తు అనేది మాత్రమే గుర్తుకొచ్చింది.అయితే ఈ గేస్తు అనేది తెలిసిన పదమే అయినా అప్పుడెందుకో గుర్తుకు రాలేదు.తమాషా ఏంటంటే గేహస్తు అనేది తట్టి "ఛా!ఇది కాదు,ఇంకేదో ఉంది" అనిపించేది తప్ప ఈ గేస్తు అనేది మాత్రం బుర్రలోకి రాలేదు:-)

      తొలగించండి
  3. Sorry to write in english!
    The one which is for ‘Ka’ is bit hard to read and guess the answers I can barely guess few (kaki,kiriti, keechaka, krishna,kempu, kaika, kokila) . Yours is pretty simple(saralamu) to read and guess. Thanks.
    Here are my answers
    1.Garuda
    2.Gayatri
    3. Giraja
    4.gita
    5.gudi
    6.Goodu
    7. Gruhini
    8. Gelupu
    9.
    10.
    11. Godugu
    12. godhanaam
    13. Gowthamudu
    14.ganga
    14.

    రిప్లయితొలగించండి
  4. రాధేశ్యాం గారికి నమస్కారములు.మీ యొక్క పద్య ప్రహేళిక లు ఈ లాక్డౌన్ లో మంచి ఆటవిడుపుతో పాటు తెలుగు భాష లోని తియ్యదనాన్ని రుచిని చవి చూపిస్తున్నాయి.ఇటువంటి ప్రహేళికలు ఇంకనూ అందించగలరు.🙏🙏

    రిప్లయితొలగించండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు