పార్వతీపతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పార్వతీపతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, జూన్ 2025, సోమవారం

విరిసేవ

ఉ.

పూవుల నాశ్రయించు పలు పుర్వుల, చీమల, తేటి గుంపులన్/
పో విదిలింపగా మనసు పుట్టదు, త్రుంచగ నీదు పూజకై -
జీవుల కాస్పదంబులగు చిన్న సుమాలవి యేలనయ్య? స్వా/
మీ! విరిసేవ సల్పెదను హృత్కమలంబిడి పార్వతీపతీ!

రాధేశ్యామ్ రుద్రావఝల 
30.06.2025

19, మే 2021, బుధవారం

కవికంఠ భూషణము లో శివ స్తుతి..!

కవికంఠ భూషణము:

కరుణాంతరంగ, భవ, గాంగజటాధర, హే మహేశ! శం/
కర, ఫాలనేత్ర, శివ, కల్మషకంఠ, సనాతనా! వశం/
కర, వ్యోమకేశ, ధరకార్ముక, జంగమ, స్థాణు, ఝర్ఝరీ!
హర, మమ్ము గాచుమిక నాపద దీర్పవె! పార్వతీపతీ!


- రుద్రావఝల రాధేశ్యామ్
19.05.2021

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు