దత్తపది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దత్తపది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, డిసెంబర్ 2020, సోమవారం

దత్తపది - సలసల, జలజల, మిలమిల, వెలవెల

ఒక మిత్రుడు పంపిన దత్తపది - సలసల, జలజల, మిలమిల, వెలవెల

చూసిన వెంటనే సరదాగా ఇలా పూరించాను.

కం.
సలసల మను గ్రీష్మమునను/
జలజల మని పాఱు ఝరిని జలకములాడన్/
మిల మిల లాడును మేనియు/
వెలవెల బోవంగ నెండ వేడిమి యంతన్!

దానిలో కవిత్వం, భావుకత ఎక్కడున్నాయి..!? అందుకని మళ్ళీ ఇలా పూరించాను:



చంపకమాల:

సలసల కాగె నాతనువు సావిరహేయన నీ తలంపునన్/
జలజల రాలె మల్లికలు జాగు సహింపక, నీదు రాకకై/
మిలమిల లాడె కన్నులివి మిన్నున తార తళుక్కులై, ప్రియా!
వెలవెల బోయె నా ముఖము, వేగమె నీచెలి చెంత జేరుమా!

- రాధేశ్యామ్ రుద్రావఝల

21.12.2020

19, ఏప్రిల్ 2018, గురువారం

నెట్టిల్లు, నట్టిల్లు,మెట్టిల్లు,మట్టిల్లు,

నెట్టిల్లు, నట్టిల్లు,మెట్టిల్లు,మట్టిల్లు,

ఈ నాలుగు పదాలూ వాడి పద్యం వ్రాయమని ఒక మిత్రుడు ఇచ్చారు నాకు (దత్తపది)..!!

కం.
నెట్టింట నుండ వలయును,
నట్టింటను మూలగదికి నడవాలోనన్..!
మెట్టింట సిగ్నలుండగ
మట్టిల్లును స్వర్గమౌను మాకది చాలున్!

నెట్ ఉండాలి,
నట్టింట్లోకీ, మూల గదిలోకీ వరండాలోకీ సిగ్నలున్న మెట్టిల్లు అది మట్టిల్లైనా మాకు స్వర్గము, అదిచాలు..! అంటోంది ఒక పెళ్ళి కావలసిన ఈ తరం అమ్మాయి..!!

అత్తారింటికి ఉండవలసిన ఏకైక క్వాలిఫికేషన్ నెట్ ఉండడం.. సిగ్నల్ బాగా రావడం ట..!!😃
- రాధేశ్యామ్ రుద్రావఝల

కం.
నెట్టింట లేనియెడలను
నట్టింటను రచ్చ చేసి నరకము సేయన్
మెట్టిల్లనుచును తలపక
మట్టిల్లుగ మార్చబోకు మన స్వర్గమికన్..!

నెట్ లేదని అలిగిన భార్యని భర్త అనునయిస్తున్నట్టు..!!

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు