30, జూన్ 2025, సోమవారం
విరిసేవ
21, జనవరి 2025, మంగళవారం
చిత్రకారుడు
ఉత్పలమాల.
ఎవ్వరు నేర్పె కొమ్మలకు నిన్ని సుమంబులు రెమ్మరెమ్మకున్/
నవ్వుచు పూయగా ప్రతి దినంబు క్రమంబును తప్పకుండగా/
దివ్వెగ భాను బింబము ద్యుతిన్ విరజిమ్మక మున్నె వర్ణములు/
నివ్వటిలంగ జేయగను నెమ్మి వహించుచుఁ నద్దె నాతడే!
ఎవరు కొమ్మకొమ్మలకూ పూవులను క్రమంతప్పకుండా పూయడం నేర్పాడో, ఆతడే ఆ పూవులు అతిశయించేటట్టుగా ఓపికగా సూర్యోదయానికి ముందే వర్ణాలు కూడా అద్దాడు.
14, ఆగస్టు 2024, బుధవారం
స్త్రీమూర్తి
ఉత్పలమాల - సప్తపాది:
25, మార్చి 2024, సోమవారం
సమస్య: జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!
సమస్య:
జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!
ఉత్పలమాల:
శ్రీ రమణీయమూర్తియగు శ్రీపతి రూపము చూడగోరుచున్/
బారులు తీరు భక్తులకు వారధులై కడు పూజ్యభావమున్/
వారక కర్ణ పేయముగ పాశురగానము చేయుచున్న పూ/
జారులజూచి వందనము సల్పిరి భక్తులు ముక్తి పొందగన్!
24, అక్టోబర్ 2023, మంగళవారం
సమస్యా పూరణము: అమ్మలు మువ్వురున్ కలిసిరమ్మహనీయుడు ఘంటమూనగన్!
సమస్య:
అమ్మలు మువ్వురున్ కలిసిరమ్మహనీయుడు ఘంటమూనగన్!
నా ప్రయత్నం:
ఉత్పలమాల:
"అమ్మలగన్న యమ్మ" యని యా ముగురమ్మల వేల్పుఁ, జాల పె/
ద్దమ్మను తా మదిన్ దలచి యా కవి పోతన వ్రాయబూనె, కా/
వ్యమ్ముగ విష్ణుగాథలను భాగవతంబు తెనుంగు జేయ, నా/
యమ్మలు మువ్వురున్ కలిసిరమ్మహనీయుడు ఘంటమూనగన్!
- రాధేశ్యామ్ రుద్రావఝల
1, జులై 2023, శనివారం
ఇళయరాజా
ఉత్పలమాల.
ఎన్నగ వేలపాటలకు నింతటి గొప్పస్వరమ్ము లల్లి, తీ/
పన్ననిదే యనన్ మదికి నబ్బురమౌ పలు చిత్ర గీతముల్/
మన్ననపొందగా శ్రవణ మాధురి నందుచు నిల్చె గాన ధా/
రన్నవ రాగమై యిళయరాజ ను పేరిట సుస్థిరమ్ముగన్!
నా అభిమాన సంగీత దర్శకుడు శ్రీ ఇళయరాజా గారి పుట్టినరోజు సందర్భంగా 2 June 2023 న వ్రాసిన పద్యం..! నెల ఆలస్యంగా పోస్టు చేస్తున్నాను.
గమనిక
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఉత్పలమాల. ఎన్నగ వేలపాటలకు నింతటి గొప్పస్వరమ్ము లల్లి, తీ/ పన్ననిదే యనన్ మదికి నబ్బురమౌ పలు చిత్ర గీతముల్/ మన్ననపొందగా శ్రవణ మాధురి నందుచు ని...
-
ఇటీవల వాట్సాప్లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
-
ఇదివరకు వాట్సాప్ లోనే ’ క’ గుణింతపు పద్య ప్రహేళిక చదివి ఉంటారు. కమ్మగా చెవిసోకి కంచికేగిన వేవి? అంటూ సాగుతుంది అది..!! అది ఎవరు వ్రాసారో త...
