ఈ జంట పద్యాలను అవధరించండి:
పెళ్ళయిన కొత్తలో/ అవకముందు:
పెళ్ళయిన కొత్తలో/ అవకముందు:
కం.
చూపులుగావవి..! హా..! విరి/
చూపులుగావవి..! హా..! విరి/
తూపులు గద నన్ను జూచి దోచెను మనసున్/
తాపము హెచ్చెను చిత్త ప్ర/
లాపము కల్గెను ప్రియసఖి లావణ్యము తోన్!
తాపము హెచ్చెను చిత్త ప్ర/
లాపము కల్గెను ప్రియసఖి లావణ్యము తోన్!
****
పెళ్ళయిన పదహారేళ్ళ తరువాత (ఈ కాలప్రమాణము వారివారి కర్మఫలానుసారము మారుచుండునని గ్రహించునది 😁)
పెళ్ళయిన పదహారేళ్ళ తరువాత (ఈ కాలప్రమాణము వారివారి కర్మఫలానుసారము మారుచుండునని గ్రహించునది 😁)
కం.
చూపులుగావవి! చిచ్చర/
తూపులు గద యామె రూపు తోచగ మదికిన్/
బీపీ హెచ్చును చిత్త ప్ర/
లాపము కల్గును శ్రీమతి రమ్మని పిలువన్/
తూపులు గద యామె రూపు తోచగ మదికిన్/
బీపీ హెచ్చును చిత్త ప్ర/
లాపము కల్గును శ్రీమతి రమ్మని పిలువన్/
కం.
చూపులుగావవి! చిచ్చర/
తూపులు, తన ఫోను తో లయ తప్పున్ /
బీపీ హెచ్చును చిత్త ప్ర/
లాపము కల్గును శ్రీమతి రమ్మని పిలువన్/
తూపులు, తన ఫోను తో లయ తప్పున్ /
బీపీ హెచ్చును చిత్త ప్ర/
లాపము కల్గును శ్రీమతి రమ్మని పిలువన్/
- రాధేశ్యామ్ రుద్రావఝల
పెళ్ళైన పదహారేళ్ళకే ఎందుకంటే ఈ పద్యాలు వ్రాసి నాలుగేళ్ళయింది. మా పెళ్ళై ఇరవై యేళ్ళు..! ఇప్పటికి ప్రచురించగలిగాను. 🤣😄😇
పెళ్ళైన పదహారేళ్ళకే ఎందుకంటే ఈ పద్యాలు వ్రాసి నాలుగేళ్ళయింది. మా పెళ్ళై ఇరవై యేళ్ళు..! ఇప్పటికి ప్రచురించగలిగాను. 🤣😄😇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి