19, మే 2021, బుధవారం

కవికంఠ భూషణము లో శివ స్తుతి..!

కవికంఠ భూషణము:

కరుణాంతరంగ, భవ, గాంగజటాధర, హే మహేశ! శం/
కర, ఫాలనేత్ర, శివ, కల్మషకంఠ, సనాతనా! వశం/
కర, వ్యోమకేశ, ధరకార్ముక, జంగమ, స్థాణు, ఝర్ఝరీ!
హర, మమ్ము గాచుమిక నాపద దీర్పవె! పార్వతీపతీ!


- రుద్రావఝల రాధేశ్యామ్
19.05.2021

13, మే 2021, గురువారం

మనవలెనన్నను మగజాతి మహిలోన...

 
సీసము.
మనవలెనన్నను మగజాతి మహిలోన,
ముఖ్యసూత్రములవి మూడు కలవు!
భార్య పెట్టిన తిండి వంకలు పెట్టక,
మూసుకు తినవలె మూడుపూట్ల!
చేతనుండెడు గిన్నె ఛీకొట్టి విసిరినా,
చూడబోకటువైపు చూపు త్రిప్పి!
యామె గొంతును పెంచి యరచు చున్నను గాని,
వినరాదు తిరిగి మాటనగరాదు!

ఆ.వె.
ఆలి పైని తిరిగి యావేశమందక/
నెమ్మదించ నామె నెమ్మదించు!
అనకు, కనకు, వినకు మన్న సూత్రములివే/
యగును గాక మగల కాత్మ రక్ష!
(లాకుడౌను దినముల గడపగను! )

🙊🙈🙉 - అనకు, కనకు, వినకు

- రాధేశ్యామ్ రుద్రావఝల

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు