25, ఆగస్టు 2023, శుక్రవారం

చంద్రయాన్ -3


మత్తేభము.
దివముల్ రాత్రుల లెక్కసేయక, నొకే ధ్యేయంబు సాధింప, ప్రా/
భవమున్ రోదసి నవ్య సీమల జయింపన్ ధీరు లీ శాస్త్రపుం/
గవు లిస్రో ఫల చంద్రయాన సవమున్ కాలూని జాబిల్లిపై/
నవరత్నోజ్జ్వల కీర్తి చంద్రికల ధన్యన్ జేసిరీ భారతిన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల
24.08.2023


గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు