చంపకమాల.
దినమణి వంశ దీపకుఁడు, తీరుగ ముద్దులు మూటగట్టుచున్/
కనకపు చేలఁ గట్టి, కరకంకణముల్, మణిహారపంక్తులన్/
తనరుచు, చాపబాణముల దాలిచి, స్వర్ణ కిరీట ధారియై/
ఘనమగు గద్దెపై నిలిచి కాంతుల చిందెను బాలరాముడై!
ప్రణతుల, మేన పుల్కల శుభమ్ముల కోరుచు నా యయోధ్య రా/
ముని కనులార గాంచితిమి మోదము, భాగ్యము నంది ధన్యతన్!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
20.12.2024
ఈ నెల 13వ తేదీన అయోధ్య రాముణ్ణి దర్శించుకున్నాం.
🙏🙏🙏
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
చాలా ప్రముఖమైన ఈ శ్లోకానికి నా అనువాద ప్రయత్నం: శ్లో. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్...
-
ఈ రోజు పంచచామర వృత్త పద్యములు ప్రయత్నించానండి.. 🙏🙏🙏 లక్షణము: 4 పాదములు ఉండును. ప్రాస నియమం కలదు ప్రతి పాదమునందు 10 వ అక్షరము యతి స్థా...
-
భారతీయ స్టేట్ బాంక్ వారు, శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా గురు సహస్రావధాని శ్రీ కడిమిళ్ల వరప్రసాద్ గారి అష్టావధానం విశాఖపట్నంలో...