7, సెప్టెంబర్ 2019, శనివారం

గరుడుడు గణపతికి తండ్రి గావలె సుమ్మీ!

మా స్నేహితుడు చంద్రశేఖర్ పంపిన సమస్య:

గరుడుడు గణపతికి తండ్రి గావలె సుమ్మీ!
నా పూరణలు:

కం.
మరకలు పడెనని కినిసి, కొ/
మరుని మొగమ్మది కడుగగ మరిమరి యురుకున్/
నురుగును గ్రక్కెడు నీ సా/
గరుడుడు గణపతికి తండ్రి గావలె సుమ్మీ!


కం.
మరకలు పడెనని, కినిసెనొ!?
త్వరపడి యా మొగము కడుగ తాపత్రయమో?
నురుగల గ్రక్కు నలల  సా/
గరు డుడుగణపతికి తండ్రి గావలె సుమ్మీ!


- రాధేశ్యామ్  రుద్రావఝల

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు