సత్యమ్ బ్రూయాత్
చాలా ప్రముఖమైన ఈ శ్లోకానికి నా అనువాద ప్రయత్నం:
శ్లో.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతనః
భావము:
అర్థం:
ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. ప్రియ వచనాలనే పలకాలి. సత్యమైనా అప్రియమైన
మాటలను పలకరాదు. ప్రియమైనదైనప్పటికీ అసత్యాన్ని పలకరాదు. ఇదే సనాతన ధర్మం.
----------------
నా అనువాద ప్రయత్నం:
ఆ. వె.
పలుక వలెను సత్య వచనమ్ము ప్రియముగా,
నప్రియమగు సత్య మనగ రాదు!
అనృతమును ప్రియమగు నని పల్కవలదను/
రీతి ధర్మమిదె సనాతనమ్ము!
రాధేశ్యామ్ రుద్రావఝల
17.12.2025
🙏🙏🙏
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఇటీవల వాట్సాప్‌లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
-
ఆ. వె. మురికి యున్న గదిని చొరలేము మన, మిక చెడిన మదిని యెట్లు చేరు హరుడు? చిత్తశుద్ధి కలిగి సేవింప, నాతడు హృదయకమలమందు కుదురుకొనును! - రాధేశ్...
-
కం. చక్రము త్రిప్పెడు చక్రికి, చక్రములో నుండి తిరుగు చక్రికి తోడై/ చక్రము సైతము తానై/ సక్రమ మార్గమును జూపు చక్రికి ప్రణతుల్! -- రాధేశ్యామ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి