29, మార్చి 2021, సోమవారం

పెళ్ళాం పై పద్యం (పెళ్ళయిన కొత్తలో & పెళ్ళయిన పదహారేళ్ళ తరువాత..!)

 



ఈ జంట పద్యాలను అవధరించండి:

పెళ్ళయిన కొత్తలో/ అవకముందు:
కం.
చూపులుగావవి..! హా..! విరి/
తూపులు గద నన్ను జూచి దోచెను మనసున్/
తాపము హెచ్చెను చిత్త ప్ర/
లాపము కల్గెను ప్రియసఖి లావణ్యము తోన్!
****
పెళ్ళయిన పదహారేళ్ళ తరువాత (ఈ కాలప్రమాణము వారివారి కర్మఫలానుసారము మారుచుండునని గ్రహించునది
😁)

కం.

చూపులుగావవి! చిచ్చర/
తూపులు గద యామె రూపు తోచగ మదికిన్/
బీపీ హెచ్చును చిత్త ప్ర/
లాపము కల్గును శ్రీమతి రమ్మని పిలువన్/


కం.

చూపులుగావవి! చిచ్చర/
తూపులు, తన ఫోను  తో లయ తప్పున్ /
బీపీ హెచ్చును చిత్త ప్ర/
లాపము కల్గును శ్రీమతి రమ్మని పిలువన్/

- రాధేశ్యామ్ రుద్రావఝల

పెళ్ళైన పదహారేళ్ళకే ఎందుకంటే ఈ పద్యాలు వ్రాసి నాలుగేళ్ళయింది. మా పెళ్ళై ఇరవై యేళ్ళు..! ఇప్పటికి ప్రచురించగలిగాను. 🤣😄😇

2 కామెంట్‌లు:

  1. "చూపులుగావవి! చిచ్చర/ తూపులు గద యామె రూపు తోచగ మదికిన్/"

    శ్రీమతి కాక పొతే ఈ వాక్యాలు ఎప్పుడూ వర్తిస్తాయి. కానీ శ్రీమతే అయితే కొన్నేళ్ళకి భీకర తూపులవుతాయి.

    రిప్లయితొలగించండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు