ఉత్పలమాల:
నల్లని మబ్బు దుప్పటులు నాకము నంతట నిండియుండగా,
మెల్లగ వాని చీల్చుకొని మేల్కొను భానుని లేతకాంతులే/
తెల్లగ భూమినంతటను తీరగు రీతిని విస్తరింపగన్/
పల్లెకు తెల్లవారగను, పట్నము మత్తుగ చేరె శయ్యకున్!
- రాధేశ్యామ్ రుద్రావఝల
31.08.2019
చంపకమాల.
దినకరుడున్ నిశాకరుడు తీరుగ నుండిరి కన్ను దోయిగా!
పెనుగ్రహకోటి కంఠ పరివేష్టిత మాలికలాయె, రోదసిన్/
మినుకుమినుక్కు తారకలు మేని తళుక్కులు కాగ, స్వామిరో!
నిను గన విశ్వమంతటను నీ ఛవి కన్పడు వేంకటేశ్వరా!