2, ఆగస్టు 2023, బుధవారం

శ్రీకృష్ణదేవరాయలపై మరొక పద్యం..!

 


సీ.

మధ్యాహ్న మార్తాండు మరపించు నట్టి నీ/

తేజమ్ము కదనాన తీవ్రతరము!

శరణన్న చిలికెడు కరుణార్ద్రహృది శర/

చ్చంద్ర బింబ సుధల చల్లదనము!!

పాలపుంతను దోపు పాలవెల్లి యలల

కవనాన పొంగేటి కమ్మదనము!

వైఖరి కఠినమై పాలన మ్మొనరింప / 

దిక్కరీంద్రుల మించు దిటవుతనము!

గీ.

వ్యధల వడదీర్ప కురిసెడు వాన చినుకు,

వెతల సేదదీర్పగ వీచు పిల్లగాలి/

ప్రకృతి నిండిన యా పరబ్రహ్మవోలె/

ప్రజలను మమేకమైనట్టి ప్రభుడ వౌచు/

వినుతికెక్కితివో రాయ! విశ్వ మంత!


- రాధేశ్యామ్ రుద్రావఝల

21.07.2023



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు