24, మార్చి 2020, మంగళవారం

కరోనా.. కరోనా..!!


ఆ.వె.
ప్రాకు, యెగురు, నడచు ప్రాణుల నొదలక/
వేపుడుగను వేడి సూపుగాను/
నాదరవుల జేసి యా చీని దేశాన/
తిని కరోన వ్యాధి తెచ్చికొనిరి..!

కం.
మేడిన్ చైనా సరుకును/
వాడెన్ భూగోళమంత వరెవా యనుచున్!
మేడిన్ చైనా వ్యాధికి/
మూడెన్ ప్రజలకు జగమది మొర్రో యనగన్!

కం.
వెల్లుల్లి మేలు చేయును/
తల్లికిమల్లే, కరోన దరిచేరదనన్,
అల్లమును కలిపి యీతడు/
పుల్లని నిమ్మను బిగించి ముక్కున గట్టెన్! 🤦🏻‍♂🤷🏻‍♂

కం.
ఉండండింట్లో! లేదా,
వుండాలిక నాసుపత్రి నొంటిగ! పైగా,
దండ పడి పటమునుండెడు/
గండము దరిజేరు నింక కరొనా దయతోన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల
24.03.2020

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు