దుమ్ముదులపవోయ్ నేస్తమా, అంతకంటేనా?
దుమ్ముదులపవోయ్ నేస్తమా, అంతకంటేనా?
బొమ్మ గీయడం, రచన చేయడం,
వంటచెయ్యటం, చెట్టు నాటటం,
ఆశకీ అవసరానికీ భేదాన్ని తర్కించడం..!
దేనికన్నా.., దేనికైనా.., ఏది చెయ్యాలన్నా,
దుమ్ముదులపవోయి మిత్రమా, మరి అంతకంటేనా?
సమయం లేదు మిత్రమా! దుమ్ము దులపవోయ్,
సాగరాల్ని ఈదాలన్నా, పర్వతాలని వంచాలన్నా,
సంగీతం వినడానికి, పుస్తకాలు చదవడానికి,
స్నేహితులతో గడపడానికి, బ్రతుకును జీవించడానికి,
సమయం లేదు మిత్రమా! దుమ్ము దులపవోయ్,
కన్నులతో సూర్యుణ్ణే చూస్తూ,
కేశాలను గాలికి వదిలేస్తూ
మంచు బిందువుల, వర్షపు జల్లుల
విశ్వం మొత్తం ముందే ఉండగ
రేపన్నది మరి లేనేలేదని,
దుమ్ము దులుపుకోవోయ్!
వార్థక్యం వచ్చేస్తోందని,
దానికి దయ ఆట్టే లేదని,
నువు తప్పక వెళ్ళే వేళకు
నువు దుమ్మై పోయేవరకూ
మది నిల్పుచు అనునిత్యం, మరి
దుమ్ము దులుపు నేస్తం..!
4, నవంబర్ 2020, బుధవారం
Dust If You Must ఆంగ్లకవితకు అనువాదం
Dust if you must, but wouldn't it be better
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఉత్పలమాల. ఎన్నగ వేలపాటలకు నింతటి గొప్పస్వరమ్ము లల్లి, తీ/ పన్ననిదే యనన్ మదికి నబ్బురమౌ పలు చిత్ర గీతముల్/ మన్ననపొందగా శ్రవణ మాధురి నందుచు ని...
-
ఆ.వె. అంటు వ్యాధికాద దైనగాని తగులు/ నంటుకున్న పిదప వ్యాప్తి చెందు/ కనుల నీరు తెచ్చు కడుపు పగలగొట్టు/ చెవులవరకు సాగి చెలగు నవ్వు..!
-
ఇటీవల వాట్సాప్‌లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి