సీ.
ప్రీతి గలిగి మూడు బిల్వ పత్రము లిడ/
ముదమున నీతండ్రి మోక్షమిచ్చు!
కుడుములనిడి మూడు గుంజీలు తీయుచో/
సుముఖుడ వయ్యెడు సుతుడవీవు!
గరిటెడు గంగతో శిరమును తడుపగ/
మెచ్చి మాపు నతడు మృత్యు భయము!
గరికెల ద్వందమ్ము కరమున నుంచగ/
విడివడ జేతువు విఘ్నచయము!
పాము లాభరణాలు పరమేశ్వరునకునై/
నాగ బంధము నీకు నడ్డికట్టు!
గజచర్మధారిగ, కరివదనునిగాను/
బూది పూయునతడు, బురదనీవు!
ఆ.వె.
అమ్మచేతి నలుగు నాకారమును దాల్చి/
యయ్య గుణము, రూప మనుకరించి/
యమ్మ కొడుకు వగుచు నయ్యపేరు నిలుపు/
భక్త సులభ! సుముఖ! పార్వతిసుత!
- రాధేశ్యామ్ రుద్రావఝల
22.08.2020
ఆ.వె.
మోజదేమొ గాని మోదకప్రియ గడ్డి/
పూలతోడ భక్తి పూజ సేయ,
తేజరిల్లి జనుల దీవింతువో స్వామి/
చవితి రోజు నిన్ను సన్నుతింప!
- రాధేశ్యామ్ రుద్రావఝల
23, ఆగస్టు 2020, ఆదివారం
వినాయకుడు - తండ్రికి తగ్గ తనయుడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
'సిరిసిరిమువ్వా' మకుటంతో శ్రీశ్రీ వ్రాసిన పద్యాలలో చాలా పద్యాలు మనల్ని విడవకుండా పట్టుకుంటాయి. వాటిల్లో ఒకటి ఇది: కందమ...
-
దక్షయజ్ఞం ఉ. దక్షుడు చంద్రుపై కినిసి దారుణశాపము నిచ్చినంత ఫా/ లాక్షుని వేడగన్ శశిని...
-
😁😁 గోంగూర పచ్చడి 😁😁 సీసము. కూర్మి కలిగి లేత గోంగూర కాడల/ యాకులన్నిటి రెల్చి యాదరమున/ మంచినీట కడిగి మంచి బట్ట దుడిచి/ పొయ్యి సన్నసెగను మూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి