నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
శార్దూలము.
ఆనందంబగువాఙ్మయాధ్యయము ధ్యేయంబై ప్రవర్తిల్లగా/నేనుల్లంబున నీపదాంబుజములన్ నెమ్మిన్ దలంతున్ గదే!ధ్యానింపంగను నీదునామమిక స్వాధ్యాయమ్ము నాకయ్యెడిన్!జ్ఞానోద్దీపన చేయవే జనని వాక్కాంతా సదా భారతీ!- రాధేశ్యామ్ రుద్రావఝల29.01.2021
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి