పై ఫొటో కు నా పద్యం:
ఆ. వె.
ఊయలూచి బుగ్గ నొకచిన్న ముద్దిచ్చి/
జోలపాట పాడి జోయనుచును/
కమ్మనైన కథల నమ్మ చెప్ప వినుచు/
హాయి నిదుర జారి నట్టి కొడుక..!
***
నిన్ను ముద్దు చేసి నీ చేష్టల మురిసి/
నిన్ను సాకినట్టి కన్నతల్లి/
పెద్దదైన పిదప ప్రేమను పంచుట/
సుతుడ! నిన్ను గాచు సుకృత మిలను!
మా మాస్టారి సవరణ:
ఆ. వె.
ఊయలూచి బుగ్గ నొకచిన్న ముద్దిచ్చి/
జోలపాట పాడి జోయని నను/
కమ్మనైన మంచికథల కలకనగ/
బుజ్జగించి నిద్ర బుచ్చితీవు!/
***
నన్ను ముద్దు చేసి నా చేష్టల మురిసి/
నన్ను సాకినట్టి కన్నతల్లి/
పెద్దదైన పిదప ప్రేమను పంచెద/
సుతుడనగుచు గాతు సుకృతమెసగ!
16, జూన్ 2024, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
'సిరిసిరిమువ్వా' మకుటంతో శ్రీశ్రీ వ్రాసిన పద్యాలలో చాలా పద్యాలు మనల్ని విడవకుండా పట్టుకుంటాయి. వాటిల్లో ఒకటి ఇది: కందమ...
-
వసంతతిలకము. క్షీరాబ్ధి నున్నహరి శేషుఁడు తోడు రాగా/ మారాజు పంక్తిరథు మన్నన పెంపు సేయన్/ గారాలు చిందు సుతుఁ గా ప్రభవించె; నేడే/ శ్రీరాముడై వెల...
-
ఉత్పలమాల - సప్తపాది: పాపగ తల్లిదండ్రులకు భాగ్యమొసంగెడు లక్ష్మి యంశ వై/ ప్రాపుగనుండి నీడవయి భర్తకు, పాపకు నీవెయమ్మవై/ యాపయి నత్త మామ లెడ నాదృ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి