జటాయువు
తిరువనంతపురం లో ఉన్న Jatayu Earth's Center Nature Park ను సందర్శించినప్పుడు వ్రాసుకున్న పద్యం ఇది:
సీ.
భీత విహ్వల యైన సీతమ్మ రోదనన్/
విని, ప్రోవ నరుదెంచు వృద్ధ యోధ!
కర్కశత్వమె గాని కరుణ యించుక లేని/
లంకేశు కెదురొడ్డు రట్టు నీది!
యతని శస్త్రపు బల్మి, నాఘాతముల నోర్చి/
ధీరత్వమున పోరు తెగువ నీది!
ముక్కుతో గోళ్ళతో రక్కసు బాధించి/
నిలువరింపగ నెంచు నిష్ఠ నీది!
గీ.
రెక్కలు తెగినేలను పడ్డ పక్కివగుచు/
మోక్ష మందితి శ్రీరాము పుణ్య కరము!
స్త్రీల గౌరవ, రక్షణ చిహ్నమనిన/
నింకెవరు నినుమించగ నిల జటాయు!
— రాధేశ్యామ్ రుద్రావఝల
పై ఫొటో నేను తీసిందే..!
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
వసంతతిలకము. క్షీరాబ్ధి నున్నహరి శేషుఁడు తోడు రాగా/ మారాజు పంక్తిరథు మన్నన పెంపు సేయన్/ గారాలు చిందు సుతుఁ గా ప్రభవించె; నేడే/ శ్రీరాముడై వెల...
-
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు : ********************* హేడ్లీ తో చెప్తున్నాను: కం. హేడ్లీ! వేడిగ సాంబా/ రిడ్లీ...
-
ఇటీవల వాట్సాప్‌లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి