16, అక్టోబర్ 2024, బుధవారం

శ్రీహరి - వర్ణనము

చంపకమాల:

కరముల శంఖచక్రములు, కాంతిలు పద్మ గదాదులున్, సదా/
యురమున కౌస్తుభమ్ము, సిరియున్ ఘనహారము లద్వితీయమై/
శిరమున నప్రమేయ మణి శింజితమౌ మకుటంబు నొప్పు శ్రీ/
హరిని దలంచి భక్తి మది నాశ్రిత వత్సలు డంచు మ్రొక్కెదన్!

- రాధేశ్యామ్ రుద్రావఝల
16.10.2024

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు