నా పద్యములు..!
నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
పుటలు
వివిధములు
తెలుగు బాల శతకము
పార్వతీపతి శతకము
వాల్మీకి రామాయణము - పద్యానువాదము
16, అక్టోబర్ 2024, బుధవారం
శ్రీహరి - వర్ణనము
చంపకమాల:
కరముల శంఖచక్రములు, కాంతిలు పద్మ గదాదులున్, సదా/
యురమున కౌస్తుభమ్ము, సిరియున్ ఘనహారము లద్వితీయమై/
శిరమున నప్రమేయ మణి శింజితమౌ మకుటంబు నొప్పు శ్రీ/
హరిని దలంచి భక్తి మది నాశ్రిత వత్సలు డంచు మ్రొక్కెదన్!
- రాధేశ్యామ్ రుద్రావఝల
16.10.2024
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
శ్రీ సీతారాములపై ఇదివరకు వ్రాసిన కొన్ని పద్యాలు..!
వసంతతిలకము. క్షీరాబ్ధి నున్నహరి శేషుఁడు తోడు రాగా/ మారాజు పంక్తిరథు మన్నన పెంపు సేయన్/ గారాలు చిందు సుతుఁ గా ప్రభవించె; నేడే/ శ్రీరాముడై వెల...
శివుడు..!!
ఆ.వె. గంగ యనిన నీకు జంగమ కడు ప్రీతి సిద్ధమీవు మరొక యుద్ధరణికి నీదు శిరము తనకు నెలవు జేసినగాని తనివి తీరకున్నదా త్రినేత్ర ? కం...
దక్షయజ్ఞం - ఖండిక
దక్షయజ్ఞం ఉ. దక్షుడు చంద్రుపై కినిసి దారుణశాపము నిచ్చినంత ఫా/ లాక్షుని వేడగన్ శశిని...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి