నా పద్యములు..!
నేను వ్రాసిన పద్యములను ఒకచోట ఉంచుటకు ఉద్దేశించినది ఇది..!
పుటలు
వివిధములు
తెలుగు బాల శతకము
పార్వతీపతి శతకము
వాల్మీకి రామాయణము - పద్యానువాదము
30, జూన్ 2025, సోమవారం
విరిసేవ
ఉ.
పూవుల నాశ్రయించు పలు పుర్వుల, చీమల, తేటి గుంపులన్/
పో విదిలింపగా మనసు పుట్టదు, త్రుంచగ నీదు పూజకై -
జీవుల కాస్పదంబులగు చిన్న సుమాలవి యేలనయ్య? స్వా/
మీ! విరిసేవ సల్పెదను హృత్కమలంబిడి పార్వతీపతీ!
రాధేశ్యామ్ రుద్రావఝల
30.06.2025
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
గమనిక
O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
దక్షయజ్ఞం - ఖండిక
దక్షయజ్ఞం ఉ. దక్షుడు చంద్రుపై కినిసి దారుణశాపము నిచ్చినంత ఫా/ లాక్షుని వేడగన్ శశిని...
సత్యమ్ బ్రూయాత్
చాలా ప్రముఖమైన ఈ శ్లోకానికి నా అనువాద ప్రయత్నం: శ్లో. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్...
బెట్టు
ఇవాళ వడ్డాది పాపయ్య గారి బొమ్మలు వెతుకుతూ ఉంటే కనబడింది ఈ బొమ్మ: దానికి వ్యాఖ్యగా నేను వ్రాసిన పద్యం: ఆ. వె. చెంతచేర బెట్టు సేయుచు ప్రియుర...