29, మార్చి 2021, సోమవారం

పెళ్ళాం పై పద్యం (పెళ్ళయిన కొత్తలో & పెళ్ళయిన పదహారేళ్ళ తరువాత..!)

 



ఈ జంట పద్యాలను అవధరించండి:

పెళ్ళయిన కొత్తలో/ అవకముందు:
కం.
చూపులుగావవి..! హా..! విరి/
తూపులు గద నన్ను జూచి దోచెను మనసున్/
తాపము హెచ్చెను చిత్త ప్ర/
లాపము కల్గెను ప్రియసఖి లావణ్యము తోన్!
****

28, మార్చి 2021, ఆదివారం

మరో సరదా పద్యము: వారఫలాలు

 మరో సరదా పద్యము:

ఉత్పలమాల:
తీయని వార్త విందువని దృష్టికి వారఫలంబు సోకగన్/
హాయనిపించి, భర్త కడు నచ్చెరువందగ, శ్రీమతిన్ త్వరన్/
సాయము కోరి రమ్మనగ, జాగును సేయక పుట్టినింటికిన్/
పోయెద నన్న నామె కనుమోదము దెల్పెను సంతసంబునన్!

(ఇది కూడా కల్పనే సుమండీ..)
😄😄😄

వ్యాజస్తుతి..!


శార్దూలము.

నీ సొమ్మేమది పోవునో, భవహరా! నీకెంత యాటాయెనో!
యే సార్థక్యము కల్గి గొప్పదగు పేరే దాల్చెదో! గొంకవో!
యీ సంసార పయోధి ముంచక ప్రభో! యెట్లైన దాటింపవో!
యో సామీ! తమ పాదముల్ గొలువ లేదో !?  తండ్రి! కాపాడుమా!

24, మార్చి 2021, బుధవారం

గోంగూర పచ్చడి..!

😁😁 గోంగూర పచ్చడి 😁😁

సీసము.
కూర్మి కలిగి లేత గోంగూర కాడల/
యాకులన్నిటి రెల్చి యాదరమున/
మంచినీట కడిగి మంచి బట్ట దుడిచి/
పొయ్యి సన్నసెగను మూకుడుంచి/
యందు చారెడు నూనె నాకుల వేయించి/
యిగురునంతవరకు మిగుల కలిపి/
దానిని రోటిలో ధాటిగా రుబ్బుచు/
నప్పుడు సరిపడు నుప్పు కలిపి/

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు