😁😁 గోంగూర పచ్చడి 😁😁
సీసము.
కూర్మి కలిగి లేత గోంగూర కాడల/
యాకులన్నిటి రెల్చి యాదరమున/
మంచినీట కడిగి మంచి బట్ట దుడిచి/
పొయ్యి సన్నసెగను మూకుడుంచి/
యందు చారెడు నూనె నాకుల వేయించి/
యిగురునంతవరకు మిగుల కలిపి/
దానిని రోటిలో ధాటిగా రుబ్బుచు/
ఆ.వె.
ఎండుమిర్చి, మెంతు, లింగు వావాలు, వె/
ల్లుల్లి పోపుబెట్టి, తల్లి యనుచు/
గోము నాంధ్రు డిటుల గోంగూరతో నొక/
పచ్చడిని సృజించె పాక కళను!
ఆ.వె.
చాల సంతసించి శాకంబరీదేవి/
సచ్చరిత్ర మిట్టి పచ్చడికిని/
కలదటంచు మిగుల ఖ్యాతిని పొందగ/
వరలు *నాంధ్రమాత* బిరుదునిచ్చె!
- రాధేశ్యామ్ రుద్రావఝల
26.12.2020
బాగుంది.
రిప్లయితొలగించండిధన్యవాదములు.
తొలగించండి