25, ఏప్రిల్ 2021, ఆదివారం
కరోనా సెకెండ్ వేవ్..!
22, ఏప్రిల్ 2021, గురువారం
కవిత్వమెలా పుడుతుంది..!?
తే. గీ. (పంచపాది)
గుండెలోతులందున తడి యుండి నపుడు/
బీజమాత్రపు భావము వికసితమగు/
రాత్రి దాగుండి భూమిని చిత్రముగను/
తెల్లవారగ కనబడు పల్లవముగ/
బయలు పడును చైతన్యమై భావకవిత..!
- రాధేశ్యామ్ రుద్రావఝల
(29.05.2018)
కవితాభావన అనే బీజం చిగురించాలంటే, గుండె లోతులలో 'తడి' ఉండాలి.
అది తగలగానే, భావనా బీజం వెంటనే చైతన్యవంతమై, చిగిర్చి, పైకి వచ్చేస్తుంది - రాత్రి లేక, తెల్లవారగానే దర్శనమిచ్చే మొలకలా!
శ్రీ డా. రామ్ ప్రసాద్ గారు చెప్పిన పై భావాన్ని పద్యరూపమున నుంచుటకు ప్రయత్నించాను.
20, ఏప్రిల్ 2021, మంగళవారం
ఇంకో పేరడీ పద్యం..!
తన భార్య ఆన్‍లైన్ షాపింగ్ లో మోసపోతుందేమో అని హెచ్చరిస్తున్నాడు భర్త..!!
శార్దూలము:
నీకున్ షాపుల కేగగాను కఱవా నీచేత కార్డుండగా/
బైకుల్, కారులు త్రొక్కుచుండి తిరుగన్ వైడెస్టు రోడ్లుండగా/
సోకుల్ పోవుచు ’నాను లైను’ సరకుల్ చూడన్ విచిత్రమ్ముగా/
వీకన్ జేకొన నీ మొబైలు తగునా!? వెఱ్ఱౌటకా శ్రీమతీ!?
🙂🙃🙂
పై పేరడీకి మూలం (ధూర్జటి విరచిత శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి)
నీకున్ మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా
జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ, నీరుండగా
పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింప కా బోయచే
జేకొంటెంగిలి మాంసమిట్లు దగునా! శ్రీకాళహస్తీశ్వరా!
దానికా శ్రీమతి ఇలా అంది:
ఆ.వె.
పైకిపోవగాను నాకును మనసేను!
పైకి పోదు నన్న భయముతోను/
కాలు కదుపలేక, కరొనా కు జడిసి నే/
నాశ్రయించితి మరి 'ఆను లైను'!
- రాధేశ్యామ్ రుద్రావఝల
శ్రీశ్రీ పద్యానికి పేరడీ..!
'సిరిసిరిమువ్వా' మకుటంతో శ్రీశ్రీ వ్రాసిన పద్యాలలో చాలా పద్యాలు మనల్ని విడవకుండా పట్టుకుంటాయి. వాటిల్లో ఒకటి ఇది:
కందము.
ఉగ్గేల త్రాగుబోతుకు/
ముగ్గేలా తాజుమహలు మునివాకిటిలో/
విగ్గేల క్రిష్ణశాస్త్రికి/
సిగ్గేలా భావకవికి సిరిసిరిమువ్వా!
******************
పై పద్యానికి నా పేరడీ:
కందము.
పక్కేలా సుఖనిద్రకు/
వక్కేలా పండ్లులేని వారికి కిళ్ళీన్/
నిక్కేలా బక్కకు, టా/
నిక్కేలా బలునకు భువి నిక్కము కాదా..!
- రాధేశ్యామ్ రుద్రావఝల
17, ఏప్రిల్ 2021, శనివారం
ప్లవ ఉగాదికి శ్రీ కడిమిళ్ల వారి అష్టావధానం
16, ఏప్రిల్ 2021, శుక్రవారం
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! - 1
కందము.
రగిలెను శ్రీమతి పతిపై/
వగచుచు "గుర్తేది మీకు పనిలో పడ మా/
యగచాట్లేవో" యనె! నిల
మగబుద్ధికి మార్పురాక మనుగడయెట్లో!?
ఇంకొకటి:-
కందము:
పగవాడు కాకపోయిన
వగ పాలౌనటుల జేయు వనితల ధరలో
తెగడుచు సాధింపగ నీ
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో!
- రాధేశ్యామ్ రుద్రావఝల
(15.07.2018)
ఆకాశవాణి విశాఖపట్నం వారిచ్చిన సమస్యకు నాపూరణ ఇది..!
15, ఏప్రిల్ 2021, గురువారం
మగబుద్ధికి మార్పురాక మనుగడ యెట్లో! -2
4, ఏప్రిల్ 2021, ఆదివారం
వేసవిలో శివుడి సదుపాయాలు..!
చంపకమాల.
చలువకు శీత శైలమును, చంద్రుడు, గంగయు నెత్తినుండ, నీ/
వలువలు దిక్కులై గళముఁ బయ్యరమేపరి యుప్ఫనంగ నీ/
వలది విబూది దేహమున హాయిగ నాడెద వేమి గొప్ప!? నీ/
విలనొక వేసవిన్ గడుపవే తెలియున్ పస పార్వతీపతీ!
శివుణ్ణి ఉద్దేశించి వేసవిలో మనపాట్లు, ఆయనకి ఉన్న సదుపాయాల గురించి చెప్తూ వ్యాజస్తుతిలో
వ్రాసిన పద్యం ఇది.
ఓ పార్వతీ పతీ, నీకు చల్లదనాన్ని కలిగించడానికి చుట్టూ మంచుకొండలు, నెత్తిమీద చంద్రుడు,
గంగ ఉన్నాయి, నీవు దిగంబరుడవు (దిక్కులే అంబరములు అంటే వలువలు, వస్తాలు గాకలిగినవాడవు,
కంఠానికి చుట్టి ఉండేది పయ్యరమేపరి అంటే (పయ్యర - గాలి, మేపరి - భక్షించేది)
పాము. (మనం ఉక్కపోస్తే ఉఫ్ అని మెడ మీద దగ్గర ఊదుకుంటాం కదా, అలాగ శివుడికి ఎప్పుడూ
అలా ఊదడానికి బుసలుకొట్టే పాములు ఉన్నాయి.) ఇవన్నీ ఉండగా పౌడర్ రాసుకున్నట్టు విబూది
ఒళ్ళంతా పట్టించుకొని హాయిగా ఉంటావు. మా భూమిమీద ఒక వేసవి గడిపిచూడవయ్యా, అప్పుడు తెలుస్తుంది
నీ పస ఎంతో.. అని భావం.
- రాధేశ్యామ్ రుద్రావఝల
04.04.2021
3, ఏప్రిల్ 2021, శనివారం
అందం తెచ్చిన తంటా..!
ఆ.వె.
అరువదేండ్ల ముసలి యముని గని కలను/
నాయువెంత మిగిలె ననుచు నడిగె/
ముప్పదేండ్లపైని మూడుమాసములని/
యా యముండు పలికె నాదరమున!
ఆ.వె.
సంతసించి నారి చెంతనుగల వైద్య/
శాలకు చని ఖర్చు చాల చేసి/
చక్కదనము తిరిగి చిక్కునట్లు చికిత్స/
నంది పాతరూపు పొందె ముదము..!
ఆ.వె.
వైద్యశాల నుండి వచ్చిన వనితను/
నకట! గ్రుద్దు కొనియె నాంబులెన్సు!
విడిచె ప్రాణ మచటె విల విలలాడుచు/
తరుణి కాయె యముని దర్శనమ్ము!
ఆ.వె.
ఏల జేసినావొ యింతటి ఘోరము?
ఆయువెట్లు దీరె ననుచు నడుగు/
పడతి జూచి యముడు బదులిచ్చె "గుర్తింప/
కుంటినమ్మ నిన్ను కోమలాంగి!"
_(ఆంగ్లములో వచ్చిన ఒక వాట్సాప్ జోకుకి పద్యానుసరణ.)_
- రాధేశ్యామ్ రుద్రావఝల
(01.08.2019) 🙏🙏🙏
2, ఏప్రిల్ 2021, శుక్రవారం
పంచచామర వృత్తము లో పద్యములు
- 4 పాదములు ఉండును.
- ప్రాస నియమం కలదు
- ప్రతి పాదమునందు 10 వ అక్షరము యతి స్థానము
- ప్రతి పాదమునందు జ , ర , జ , ర , జ , గ గణములుండును.
గమనిక
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఇదివరకు వాట్సాప్ లోనే ’ క’ గుణింతపు పద్య ప్రహేళిక చదివి ఉంటారు. కమ్మగా చెవిసోకి కంచికేగిన వేవి? అంటూ సాగుతుంది అది..!! అది ఎవరు వ్రాసారో త...
-
ఉత్పలమాల. ఎన్నగ వేలపాటలకు నింతటి గొప్పస్వరమ్ము లల్లి, తీ/ పన్ననిదే యనన్ మదికి నబ్బురమౌ పలు చిత్ర గీతముల్/ మన్ననపొందగా శ్రవణ మాధురి నందుచు ని...
-
ఇటీవల వాట్సాప్లో ఆమాత్రం ఈమాత్రం తెలుగులో మెసేజులు చదివే వారికీ, తెలుగు భాష పట్ల ఆసక్తి ఉన్నవారికందరికీ ఈ పద్యం ఎదురయ్యే ఉంటుంది. ఎందుకంట...
