విజయవాడలో పని చూచుకొని అక్కడి నుంచి
విశాఖపట్నానికి తిరిగి బయల్దేరినప్పటి సంగతి ఇది.
సంబల్పూర్ ఎక్స్ ప్రెస్ దొరికితే అది ఎక్కాను, నా పాట్లు అవధరించండి..!
ఆ.వె.
ట్రైను స్పెషలటంచు రన్నింగునెక్కితి/
గూడు చేర ప్రొద్దు గూక కుండ/
స్పెషలు ట్రైను లేటు జీవిత కాలమై/
యిల్లు చేరు సరికి తెల్లవారె!
కం.
టీటీ గారికి చెప్పగ/
వాటంగా బెర్తు రాసి పక్కకి పిలిచెన్!
ధాటిగ మామూలిడి, నా
సీటుకు వడివడిగ నడచి చేరితి నంతన్!
తీరా ఎక్కాక లోపల ఏసీ కోచ్ పరిస్థితి ఎలా ఉందంటే:
ఆ.వె.
ఆక్రమించుకొనుచు నన్ని బెర్తులు వారె/
దుప్పటీలు పరచి దొరల వలెను/
విస్తరించుకొనిరి పేకాట రాయళ్ళు/
సేదదీర మనకు సీటు లేదు!
ఆ.వె.
వేరుశనగ పొట్టు పారబోయు నొకడు,
నీచు తినుచు కంపు నించు నొకడు!
ఉలికి పడగ కాళ్ళ నెలుకలు నర్తించు!
వెతలు రైలు లోన కతలు గావు!
ఆ.వె.
క్రింది బెర్తులన్ని ముందున్న యాత్రికు
పడకలౌచు హాయి వారి కొసగు!
వారి కాళ్ళ వద్ద కూరుచొన మనసు
రాక లెమ్మనంటి వీక తోడ..!
ఆ.వె.
కాలు బెణికె నేను కదలేననెనొకడు/
పెద్దదాన వీవె సద్దుకొనవొ/
యనుచు నొక్క పడతి యనునయింపగ నేను/
సైడు బెర్తు నెక్కి చస్తి నపుడు!
రాత్రి అయ్యాక పడుకుంటే ఇక చూస్కోండి:
ఆ.వె.
గురక పెట్టి చంపు కుంభకర్ణుడొకడు!
గుక్క పట్టి యేడ్చు గుంట డొకడు!
పక్కవాని బాధ పట్టనే పట్టదు!
రాత్రి పూట రైలు యాత్రికులకు!
16.11.2018
సంబల్పూర్ ఎక్స్ ప్రెస్ దొరికితే అది ఎక్కాను, నా పాట్లు అవధరించండి..!
ఆ.వె.
ట్రైను స్పెషలటంచు రన్నింగునెక్కితి/
గూడు చేర ప్రొద్దు గూక కుండ/
స్పెషలు ట్రైను లేటు జీవిత కాలమై/
యిల్లు చేరు సరికి తెల్లవారె!
కం.
టీటీ గారికి చెప్పగ/
వాటంగా బెర్తు రాసి పక్కకి పిలిచెన్!
ధాటిగ మామూలిడి, నా
సీటుకు వడివడిగ నడచి చేరితి నంతన్!
తీరా ఎక్కాక లోపల ఏసీ కోచ్ పరిస్థితి ఎలా ఉందంటే:
ఆ.వె.
ఆక్రమించుకొనుచు నన్ని బెర్తులు వారె/
దుప్పటీలు పరచి దొరల వలెను/
విస్తరించుకొనిరి పేకాట రాయళ్ళు/
సేదదీర మనకు సీటు లేదు!
ఆ.వె.
వేరుశనగ పొట్టు పారబోయు నొకడు,
నీచు తినుచు కంపు నించు నొకడు!
ఉలికి పడగ కాళ్ళ నెలుకలు నర్తించు!
వెతలు రైలు లోన కతలు గావు!
ఆ.వె.
క్రింది బెర్తులన్ని ముందున్న యాత్రికు
పడకలౌచు హాయి వారి కొసగు!
వారి కాళ్ళ వద్ద కూరుచొన మనసు
రాక లెమ్మనంటి వీక తోడ..!
ఆ.వె.
కాలు బెణికె నేను కదలేననెనొకడు/
పెద్దదాన వీవె సద్దుకొనవొ/
యనుచు నొక్క పడతి యనునయింపగ నేను/
సైడు బెర్తు నెక్కి చస్తి నపుడు!
రాత్రి అయ్యాక పడుకుంటే ఇక చూస్కోండి:
ఆ.వె.
గురక పెట్టి చంపు కుంభకర్ణుడొకడు!
గుక్క పట్టి యేడ్చు గుంట డొకడు!
పక్కవాని బాధ పట్టనే పట్టదు!
రాత్రి పూట రైలు యాత్రికులకు!
16.11.2018
చక్కగపద్యములల్లుచు
రిప్లయితొలగించండిచిక్కులవివరించుకవులుచిక్కిరిమాకున్
మక్కువమీరగచదువుచు
మ్రొక్కెదమీయోర్పునుగని ముదమందిమదిన్
ధన్యవాదాలు రాజు గారూ..!!
తొలగించండి