తే. గీ. (పంచపాది)
గుండెలోతులందున తడి యుండి నపుడు/
బీజమాత్రపు భావము వికసితమగు/
రాత్రి దాగుండి భూమిని చిత్రముగను/
తెల్లవారగ కనబడు పల్లవముగ/
బయలు పడును చైతన్యమై భావకవిత..!
- రాధేశ్యామ్ రుద్రావఝల
(29.05.2018)
కవితాభావన అనే బీజం చిగురించాలంటే, గుండె లోతులలో 'తడి' ఉండాలి.
అది తగలగానే, భావనా బీజం వెంటనే చైతన్యవంతమై, చిగిర్చి, పైకి వచ్చేస్తుంది - రాత్రి లేక, తెల్లవారగానే దర్శనమిచ్చే మొలకలా!
శ్రీ డా. రామ్ ప్రసాద్ గారు చెప్పిన పై భావాన్ని పద్యరూపమున నుంచుటకు ప్రయత్నించాను.
గుండెలోతులలో చెమ్మ
రిప్లయితొలగించండికవితా బీజానికి కమ్మ
నీటితో చిగురించే రెమ్మ
ఆహా..! మూడు ముక్కల్లో ఎంతబాగా చెప్పారండీ..! ధన్యోస్మి..!
రిప్లయితొలగించండిఎంత చక్కటి భావన!మీ సృజనాత్మకతకూ,సాహితీప్రతిభకూ వందనం 🙏
రిప్లయితొలగించండిధన్యవాదాలు ధరిత్రిగారూ..! 🙏
తొలగించండి