14, సెప్టెంబర్ 2026, సోమవారం

దోమ

మా పద్యసౌందర్యం వాట్సాప్ వేదికలో శ్రీ వడ్డాది మూర్తిగారు వ్రాసిన పద్యానికి నా పూరణ:

ఉ.
దోమని తీసివేయకుము దోమను మించినశత్రువెవ్వడే/
నీమము లేక నెత్తురును నేతిని త్రావినయట్లు త్రావు యీ
దోమల నిల్వరింప యమ దూతలకైనను సాధ్యమౌనె? స్వా
మీ, మము కావరావ! జనమేజయ, దోమల యాజి చేయగన్!

08.06.2026
********************
ఇంకొక్కటి దోమమీదే:

మత్తేభం.
విన  గుయ్యంచు నిశీధి వేళలను ప్రావీణ్యంబు చూపించుచున్/
తన తొండంబును సూదిగా మలచి రక్తంబున్ నిదానించి త్రా/
వును! యెఱ్ఱెఱ్ఱని దద్దురుల్ చుఱుచుఱల్ పుట్టింపగా చంప బో/
యిన యోధాగ్రణి తాడనంబునకు చిక్కీచిక్కకన్  నేర్పుతో/
తన ద్రోవన్ తను జారిపోవు నకటా ధాత్రిన్ విజృంభించు దా/
రుణమౌ కీటక మట్టి దోమపయి పోరున్ గెల్వ లేమెందుకో?
ఘన శాస్త్రజ్ఞుల మేధ చాలదొకొ! మోక్షమ్ము మనకెప్పుడో!

రాధేశ్యామ్ రుద్రావఝల 
16.06.2026

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు