1, జూన్ 2023, గురువారం
పనిమంతులు..!
18, నవంబర్ 2022, శుక్రవారం
కాకి
ఆ. వె.
అన్నమునకు కాకి ఆకలి గొనుచును/
గిన్నె ముట్టినంత కేకలేసి,
పితరులకు ప్రపత్తిఁ బిండము పెట్టి గై/
కొనగ కాకి పిలువ మనకె చెల్లు!
- రాధేశ్యామ్ రుద్రావఝల
22.03.2022
7, నవంబర్ 2022, సోమవారం
హంపీ క్షేత్ర సందర్శనానంతర స్పందన: - 2
(హంపీక్షేత్ర సందర్శనానంతర spandana-1 ను చదవడానికి నొక్కండి)
హంపీక్షేత్ర సందర్శనానంతర స్పందన - 2:
చంపకమాల.
ధర
జనియింపగా పనిచె దైవతశిల్పిని, హంపి భూమికిన్/
వరమిడినట్లు
స్రష్టయె; స్థపత్యము సేయగ విశ్వకర్మ తా/
పరిమితి
లేని కల్పన లపార శిలాకృతులందు నిల్పగా/
నరిగె; హజార రామ నిలయమ్మట కన్పడె మేన్గగుర్పడన్!!
ఉత్పలమాల.
త్రచ్చి కఠోరమౌ శిలల దాగెడు శిల్పపు సౌకుమార్యమున్ /
నిచ్చెరఁ జల్ల దాగు నవనీతము వోలె బహిర్గతంబు కా/
నిచ్చెడు శిల్పులార తమ రేకడ నేర్చిరొ యిట్టి విద్య, తా/
మెచ్చుచు ఱాతి స్తంభముల మీట స్వరంబుల వాణి పల్కెడిన్!
°•°•°•°•°•°•°•°
తే. గీ.
హంపి జయగాథ యొక యితిహాసము; ఘన/
కీర్తికెక్కిన సమ్రాట్టు కృష్ణరాయ/
లమర పురికేగె హంసగా; నప్రతిహత
బింబమరిగెను తన ప్రతిబింబము విడి!
- రాధేశ్యామ్ రుద్రావఝల
06.11.2022
- రాధేశ్యామ్ రుద్రావఝల
గమనిక
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు : ********************* హేడ్లీ తో చెప్తున్నాను: కం. హేడ్లీ! వేడిగ సాంబా/ రిడ్లీ...
-
ఉత్పలమాల: శ్రీ వనితా కరాంబుజ సుసేవిత పాద యుగమ్ము దల్చెదన్/ పావని గంగ జన్మమయి పాఱెడు పాద యుగమ్ము నంటెదన్/ దేవమునీంద్ర సన్నుతుల తేలెడు పాద...
-
మరొక కథకు పద్యం. ----------------------------- పగటి కలల బాపఁడు ----------------------------- ఆ. వె. బ్రాహ్మడొకఁ డలసుఁడు వారణాశి నివాసి, వీథ...
