చంపకమాల:
21, ఏప్రిల్ 2022, గురువారం
జగదీశుడు రాముడు
చంపకమాల:
18, ఏప్రిల్ 2022, సోమవారం
ఇడ్లీలపై పద్యాలు:
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు :
*********************
హేడ్లీ తో చెప్తున్నాను:
కం.
హేడ్లీ! వేడిగ సాంబా/
రిడ్లీలవి రెండు తినగ నింపగు మదికిన్!
బ్రెడ్లూ బర్గరు పిజ్జా/
లిడ్లీలకు సాటిరావు యేనాడైనన్!
*********************
కం.
బూరెలు పులిహోరలు గోం /
గూరయు పప్పూపులుసును కొబ్బరి చట్నీ/
గారెలు నేతులతో నిం/
పారగ నరిటాకున తిన నదురును హేడ్లీ!
*********************
ఆ.వె.
మల్లె పూలవోలె తెల్లని యిడ్లీలు/
వెన్న ముద్ద నోట పెట్టినట్టు/
కరిగిపోయినంత కలుగదే సంప్రీతి!
యట్టి యిడ్లి కదియె యౌను సాటి!
*********************
తే.గీ.
వేడి సాంబారు, పచ్చళ్ళ వేడ్క ముంచి/
తెల్లటిడ్లీలఁ దినునట్టి దినము దినము!
నేయి, కారంబు లద్దుచు ప్రీతి మీఱ/
రవ్వ యిడ్లీల రుచియించు రసన రసన!
- రాధేశ్యామ్ రుద్రావఝల
*********************
ఈ మధ్యే పరిచయమైన కోరా మిత్రులు శ్రీ చంద్రమోహన్ గారు ఇడ్లీ పై వ్రాసిన పద్యం:
కం.
మల్లెల బోలిన మెత్తని
తెల్లనివిడ్లీలటంచు తెలియును గానీ
పుల్లని,వెర్రని, వితరము
లెల్లను చూపించ మాకు ఇడ్లీలగునే!
25, ఫిబ్రవరి 2022, శుక్రవారం
జ్ఞానోద్దీపన చేయవే జనని వాక్కాంతా సదా భారతీ!
శార్దూలము.
ఆనందంబగువాఙ్మయాధ్యయము ధ్యేయంబై ప్రవర్తిల్లగా/
నేనుల్లంబున నీపదాంబుజములన్ నెమ్మిన్ దలంతున్ గదే!
ధ్యానింపంగను నీదునామమిక స్వాధ్యాయమ్ము నాకయ్యెడిన్!
జ్ఞానోద్దీపన చేయవే జనని వాక్కాంతా సదా భారతీ!
- రాధేశ్యామ్ రుద్రావఝల
29.01.2021
12, జనవరి 2022, బుధవారం
హనుమన్ సద్భక్తి నే మ్రొక్కెదన్!
శుభోదయం.
శార్దూలము.
ఉర్వీపుత్రిక జాడ తానెఱిఁగి యయ్యుత్సాహ సంరంభమున్/
గర్వాంధుండగు రాక్షసాగ్రణికి చీకాకున్ ప్రకోపింపగా/
నార్వేరంబు తొలంగ దాశరథికిన్ హర్షంబు చేకూర్చు నా/
దుర్వారోద్యమ బాహు విక్రముని, నస్తోకప్రభారాశినిన్/
సర్వాభీష్ట ఫలప్రదాత హనుమన్ సద్భక్తి నే మ్రొక్కెదన్!
ఆర్వేరము = కలఁత
భూమిజ యైన సీత జాడ తెలిసికొని, ఆ ఉత్సాహముతో, గర్వాంధుడగు రాక్షసరాజైన రావణుని చీకాకు పరచి, రామునికి కలత పోగొట్టి ఆనందమును కలిగించిన ఎదురులేని బాహుబల సంపన్నుడూ, అనల్పమైన కాంతితో వెలుగొందేవాడు, అభీష్టములన్నీ నెరవేర్చేవాడూ అయిన హనుమకు సద్భక్తితో నేను నమస్కరిస్తున్నాను.
- రాధేశ్యామ్ రుద్రావఝల
12.01.2022
11, ఆగస్టు 2021, బుధవారం
పెళ్ళాం అలుక - బాపు కార్టూనుకు పద్యం..!
పై పద్యానికి మా గురువుగారు శ్రీ శ్రీరామారావు గారి సవరణ:
నేనేదైనను చేసితో? యలుగగా నేనేమియుం జేయనో?
నేనై నిన్నొకమాటయంటి ననియో? నేనేమి మాటాడనో?
నేనేదైనను కొంటినన్న వగపో? నేనేమి తేలేదనో?
యీనాడేమిది 'మూడు' భంగిమము, నాకేమింకమూడెంగదో?!
గమనిక
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.
ప్రచలిత సమర్పణలు
-
ఒకసారి ఇడ్లీలు తింటూ వ్రాసిన పద్యాలు : ********************* హేడ్లీ తో చెప్తున్నాను: కం. హేడ్లీ! వేడిగ సాంబా/ రిడ్లీ...
-
ఉత్పలమాల: శ్రీ వనితా కరాంబుజ సుసేవిత పాద యుగమ్ము దల్చెదన్/ పావని గంగ జన్మమయి పాఱెడు పాద యుగమ్ము నంటెదన్/ దేవమునీంద్ర సన్నుతుల తేలెడు పాద...
-
మరొక కథకు పద్యం. ----------------------------- పగటి కలల బాపఁడు ----------------------------- ఆ. వె. బ్రాహ్మడొకఁ డలసుఁడు వారణాశి నివాసి, వీథ...